Thursday, May 2, 2024

క‌లియుగ ర‌హ‌స్యాల‌ని ఛేదించే కార్తికేయ‌.. రిలీజ్ డేట్ ఫిక్స్..

కొంత కాలం క్రితం చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో నిఖిల్ హీరోగా వచ్చిన సినిమా కార్తికేయ.. భారీ విజయాన్ని నమోదు చేసుకున్న ఆ సినిమాకి సీక్వెల్ గా కార్తికేయ 2 రూపొందుతోంది. కార్తికేయ మాదిరిగా ఈ సినిమా కూడా తనకి పెద్ద హిట్ ఇస్తుందని నిఖిల్ భావిస్తున్నాడు. విశ్వప్రసాద్ – వివేక్ కూచిభొట్ల నిర్మాణంలో చందు మొండేటి డైరెక్ట్ చేస్తున్నారు. కలియుగానికి సంబంధించిన ఒక రహస్యాన్ని ఛేదించే ప్రయత్నంగా ఈ కథ నడుస్తున్న‌ట్టు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు మూవీ మేక‌ర్స్.

జూలై 22వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు ప్ర‌క‌టిస్తూ అధికారిక పోస్టర్ రిలీజ్ చేశారు. కథ నేపథ్యానికి తగినట్టుగానే శ్రీకృష్ణుడి ఆకారానికి సంబంధించిన కటింగ్ ఆకట్టుకుంటోంది. హీరో ఒక దివ్యమైన నగరాన్ని దర్శిస్తున్నట్టుగా ఈ పోస్టర్ ఉంది. ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటించింది. తెలుగుతో పాటు తమిళ.. మలయాళ.. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. స్వాతి రెడ్డి కూడా ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించినట్టుగా తెలుస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement