Tuesday, April 30, 2024

బొగత జలపాతాన్ని సందర్శించిన జబర్దస్త్ కమెడియన్

వాజేడు, ప్రభన్యూస్: తెలంగాణ మినీ నయాగరా జలపాతంగా పేరు గాంచిన బొగత జలపాతాన్ని జబర్దస్త్ కమెడియన్ రాకెట్ రాఘవ శుక్రవారం సందర్శించారు. బొగత అందాలను తిలకించి ఫిదా అయ్యారు. అడవి తల్లి ఒడిలో ఇంతటి అద్భుతమైన జల ధారలు ప్రకృతి సిద్ధంగా ఉండడం ఆకర్షింప చేస్తున్నాయని, ఈ అందాలను తిలకిస్తూ చక్కటి ఆహ్లాదాన్ని పొందానని ఆనందం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుండి బొగత అందాలను తిలకించడానికి ప్రాంతానికి వచ్చినట్టు తెలిపారు. బొగత జలపాతం అందాలు చాలా అద్భుతంగా ఆకర్షనీయంగా ఉన్నాయని ఆనందం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement