Thursday, April 18, 2024

యాక్ష‌న్ మోడ్ లో కింగ్.! ఇంట్రెస్టింగ్ గా ఘోస్ట్ ట్రైల‌ర్..

ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ది ఘోస్ట్ మూవీతో ఆడియన్స్‌ను అలరించేందుకు రెడీ అవుతున్నాడు టాలీవుడ్ కింగ్ నాగార్జున. శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌‌ఎల్‌‌పీ, నార్త్ స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 5న థియేటర్ల‌లో సందడి చేయనుంది. సోనాల్‌ చౌహాన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. గుల్‌ పనగ్‌, అనిక సురేంద్రన్‌ కీలక పాత్రల్లో నటించారు. ఇక‌పోతే కొద్దిసేప‌టి క్రితం ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.

ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. నాగార్జున కంప్లీట్ యాక్షన్ మోడ్‌లోకి దిగారు. ఎవడు వాడు అంటూ నవీన్ చంద్ర వాయిస్‌తో ట్రైలర్‌ను స్టార్ట్ చేశారు. నాగార్జున కత్తి పట్టుకుని నిలబడగా.. అతని ముందు అందరూ మోకాళ్లపై కూర్చున్నారు. బ్యాక్‌గ్రౌండ్‌లో ఘోస్ట్ అంటూ వాయిస్ వినిపిస్తుంది. డబ్బు, సక్సెస్.. సంతోషం కంటే శత్రువులనే ఎక్కువ సంపాదిస్తుందంటూ నాగార్జున చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ మూవీగా ది ఘోస్ట్ సినిమాను ప్రవీణ్ సత్తారు తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. నాగార్జున రెండు గెట‌ప్స్‌లో క‌నిపిస్తున్నట్లు సమాచారం. అయితే ట్రైలర్‌లో ఒక గెటప్ మాత్రమే చూపించారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement