Friday, April 26, 2024

ఇష్క రీ-రిలీజ్ ట్రైలర్.. వీడియో

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో ప్ర‌తి వారం కొత్త సినిమాల‌ రిలీజ్ లతో పాటు స్టార్ హీరోల సూప‌ర్ హిట్ సినిమాలు రీ-రిలీజ్ అవుతూ ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తోన్నాయి. మ‌హేష్‌బాబు, ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ న‌టించిన సినిమాలు రీ-రిలీజ్‌లోనూ చ‌క్క‌టి వ‌సూళ్ల‌ను రాబ‌ట్టాయి. కాగా, ఈ రీ-రిలీజ్ ట్రెండ్‌లోకి యంగ్ హీరో నితిన్ సినిమా కూడా చేరుతోంది. నితిన్‌, నిత్యామీన‌న్ జంట‌గా న‌టించిన ‘ఇష్క్’ మూవీ ఈ నెల (మార్చి) 29న రీ-రిలీజ్ కానుంది. నితిన్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ సినిమాను మ‌రోసారి ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్నారు మేకర్స్. కాగా, ఈ రోజు ఈ మూవీ రీ-రిలీజ్ ట్రైలర్ రిలీజ్ చేశారు. 2.24 సెకన్ల ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

YouTube video

2012లో రిలీజైన ఈ సినిమాకు విక్ర‌మ్ కే కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. వ‌రుస ప‌రాజ‌యాల‌తో స‌త‌మ‌త‌మ‌వుతోన్న నితిన్ ఈ సినిమాతోనే తిరిగి విజ‌యాల బాట ప‌ట్టాడు. నితిన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా ఈ సినిమా నిలిచింది. క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్‌గానే కాకుండా రెండు నంది అవార్డుల‌ను కూడా ఇష్క్ సొంతం చేసుకోవ‌డం గ‌మ‌నార్హం. అనూప్ రూబెన్స్ కంపోజ్ చేసిన పాట‌లు మ్యూజిక్ ల‌వ‌ర్స్‌ను బలే ఆక‌ట్టుకుంటాయి. మరి థియేటర్లలో ఇరగతీసిన ఈ రోమ్-కామ్ మూవీ రీ-రిలీజ్ లో ప్రేక్షకులని ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. ఇక ప్ర‌స్తుతం నితిన్ వ‌క్కంతం వంశీ సినిమాలో న‌టిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాతో పాటు ఇటీవ‌లే వెంకీ కుడుముల డైరెక్ష‌న్‌లో ఓ సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement