Friday, April 26, 2024

కళ్యాణ్ రామ్ సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్ !!

కెరీర్ ప్రారంభించి చాలా ఏళ్ళు అవుతున్నా సరైన హిట్ లేదు నందమూరి కళ్యాణ్ రామ్ కు. ఇక గతేడాది సతీష్ వేగేశ్న దర్శకత్వం లో వచ్చిన ఎంత మంచివాడవురా సినిమా కూడా సక్సెస్ కాలేకపోయింది. అయితే ఇప్పుడు నందమూరి కళ్యాణ్ రామ్ మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై ఓ సినిమా చేయబోతున్నాడు. రాజేంద్ర అనే కొత్త దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం చేయనున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ అప్డేట్ బయటకు వచ్చింది.

ఈ సినిమాకు అమిగోస్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ జూన్ నుంచి ప్రారంభించనున్నారట. ఇదిలా ఉండగా బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న అఖండ సినిమాలో కూడా కళ్యాణ్ రామ్ నటిస్తున్నాడని ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తల పై అధికారిక ప్రకటన మాత్రం ఎక్కడా రాలేదు. మరి ఇందులో నిజముందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement