Monday, May 6, 2024

నేను పొలిటీషియన్ కాదు…రేణు దేశాయ్ ఫైర్

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా పేద వారికి సహాయం చేయడానికి కొంతమంది స్టార్స్ ముందుకు వస్తున్నారు. వారిలో రేణుదేశాయ్ కూడా ఉంది. ఇంస్టాగ్రామ్ ద్వారా సహాయం అడిగిన వారికి తన వంతు సహాయ సహకారాలు చేస్తుంది రేణుదేశాయ్. అయితే తనకి హాయ్ హలో అంటూ చాలా మెసేజ్ లు రావడంతో సమస్య చెప్పుకునేవారు వారి మెసేజ్ లు కిందకి వెళ్ళి పోతున్నాయని… అందువల్ల వారి మెసేజ్ లను చూడలేకపోతున్నానని రేణు దేశాయ్ అన్నారు.

అయితే మరికొంతమంది సహాయానికి కూడా డిమాండ్ చేస్తుండడంతో వాటిని షేర్ చేసి సంచలన వ్యాఖ్యలు చేశారు రేణుదేశాయ్. నేను చేయగలిగినంత లో చేస్తున్నా అని తన మెసేజ్ బాక్స్ అంతా నిండిపోయి ఉందని అందుకే అందరికీ రెస్పాండ్ కాలేకపోతున్న అని అన్నారు. తనని కూడా అర్థం చేసుకోవాలి అని చెప్పుకొచ్చారు రేణు. అంతేకాకుండా తాను షేర్ చేసిన స్క్రీన్ షాట్ లో ఓ మెసేజ్ లు హైలెట్ చేశారు.

ఆ మెసేజ్ లో ఈ ఎక్కడ మీ సాయంమ్.. ఉన్న వాళ్లనే పట్టించుకుంటారా అంటూనే మెసేజ్ పెట్టాడు ఓ నెటిజన్. అయితే ఆ ప్రశ్నకు అడగడానికి నేనేమన్నా పొలిటీషనా అంటూ ప్రశ్నించారు. ఇలాంటి ప్రశ్నలు మీరు ఓటు వేసి గెలిపించుకున్న రాజకీయ నాయకులను అడగండి అని కామెంట్ పెట్టారు రేణుదేశాయ్. అలాగే ఇలాంటి విషయాల్లో కూడా డిమాండ్ చేయడం బాధ కలిగించే మాట్లాడడం తనలోని స్ఫూర్తిని దెబ్బ తీస్తుందని అన్నారు.

https://www.instagram.com/p/CPDGROthgbh/?utm_medium=copy_link

Advertisement

తాజా వార్తలు

Advertisement