Sunday, April 28, 2024

NANI : హాయ్‌ నాన్న’ లో గొప్ప మ్యాజిక్‌ వుంది – నాని..

నేచురల్‌ స్టార్‌ నాని , శౌర్యువ్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘హాయ్‌ నాన్నా’ తాజాగా బిట్స్‌ ఫిలాని క్యాంపస్‌ లో జరిగిన గ్రాండ్‌ ఈవెంట్‌ లో ఈ సినిమా మూడో సింగిల్‌ ‘అమ్మాడి’ పాటని విడుదల చేశారు. నేచురల్‌ స్టార్‌ నాని మాట్లాడుతూ.. ఇక్కడ నుంచి మా ప్రమోషనల్‌ కాంపెయిన్‌ స్టార్ట్‌ కావడం చాలా ఆనందంగా వుంది. హాయ్‌ నాన్నలో మీకు కావాల్సినంత ప్రేమ దొరుకుతుంది. థియేటర్‌ కి వెళ్లి మంచి ప్రేమకథ చూసి చాలా రోజులైయింది.

ఇందులో మీకు టన్నులకొద్ది ప్రేమ దొరుకుతుంది. హాయ్‌ నాన్నలో గొప్ప మ్యాజిక్‌ వుంది. అది మీ అందరికీ నచ్చుతుంది. సీతారామం తర్వాత మృణాల్‌ ని అందరూ సీత అంటు-న్నారు. దీనికి మించిన పాత్ర హాయ్‌ నాన్నలో తను చేసిందని మా నమ్మకం.

మృణాల్‌ ఠాకూర్‌ మాట్లాడుతూ.. సీతారామంతో మీ అందరూ నాపై ఎంతో ప్రేమ చూపించారు. హాయ్‌ నాన్నలో అమ్మాడి పాట చాలా స్పెషల్‌. హేషమ్‌ అబ్దుల్‌ స్వరపరిన పాటలు అంటే నాకు చాలా ఇష్టం. ఇందులో కూడా అద్భుతమైన పాటలు వున్నాయి. అన్నారు . దర్శకుడు శౌర్యువ్‌ మాట్లాడుతూ.. హాయ్‌ నాన్న డిసెంబర్‌ 7న సినిమా విడుదలవుతుంది. అన్నారు
సంగీత దర్శకుడు హేషమ్‌ అబ్దుల్‌ వహాబ్‌ మాట్లాడుతూ.. హాయ్‌ నాన్నలో భాగం కావడం ఆనందంగా వుంది. అన్నారు. మోహన్‌ చెరుకూరి, డాక్టర్‌ విజయేందర్‌ రెడ్డి తీగల నిర్మించిన ఈ పాన్‌ ఇండియా మూవీలో బేబీ కియారా ఖన్నా ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement