Friday, September 22, 2023

హాయ్ నాన్న ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్.. ఫుల్ సాంగ్ వ‌చ్చేది అప్పుడే

నాని మోస్ట్ అవైటెడ్ మూవీ హాయ్ నాన్న మూవీ నుంచి మ్యూజిక్ ప్రమోషన్స్ షురూ అయ్యాయి. తాజాగా మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ సింగిల్ కి సంబందించిన ప్రోమో ను రిలీజ్ చేశారు. సెప్టెంబర్ 16న ఫుల్ సాంగ్ రిలీజ్ చేయ‌నున్న‌ట్టు వెల్ల‌డించారు. సమయమా అంటూ సాగే ఈ పాటను మ్యూజిక్ డైరెక్టర్ హేషం అబ్ధుల్ వహాబ్ కంపోజ్ చేశారు. తెలుగు తో పాటుగా, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ పాట అదే రోజున రిలీజ్ కానుంది.

- Advertisement -
   

మృణాల్ ఠాకూర్, కియారా ఖన్నా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి, విజేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్న ఈ చిత్రం ను డిసెంబర్ 21, 2023 న వరల్డ్ వైడ్ గా భారతీయ ప్రధాన బాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement