Monday, May 6, 2024

కొత్త వేష‌ధార‌ణ‌కు సై అంటున్న హీరోలు

నటించే ప్రతి సినిమా ఆర్టిస్టులకు ముఖ్యమైనదే. కేవలం ఒక సినిమాతో పొజీషన్స్‌ కూడా మారుతుం టాయి. అందుకే అత్యంత జాగ్రత్తగా కథలను ఎంపికచేసు కుంటున్నారు. ఇందుకోసం కొత్త గెటప్‌లు వేసుకుంటు న్నారు. డీ గ్లామర్‌ పాత్రలు చేయడానికి సిద్దమే అంటు న్నారు. హీరోల్లో ఇలాంటి మార్పు రావడం వల్ల కొత్త కథ లు పుట్టుకొచ్చాయి. అలాంటి చిత్రాలు బాక్సాఫీసు విజయాలను సొంతం చేసుకున్నాయి. దీనివల్ల హీరోల స్టార్‌డమ్‌ పెరుగుతూ వస్తోంది. మన హీరోలు సినిమా కోసం ఎలాంటి సాహసం చేయడాని-కై-నా రెడీగా ఉంటు-న్నారు. ప్రేక్షకులను మెప్పించాడనికిప్రయోగాలు చేస్తు న్నారు. పాత్రల కోసం లుక్‌ మార్చేసి ఆశ్చర్యపరు స్తున్నారు.
గ్లామర్‌ ప్రపంచంలో ఎప్పుడూ ఒకేలా కనిపిస్తే ఒ కరోజు కాకున్నా ఇంకో రోజు… లేదా ఆ తర్వాత అయినా ప్రేక్షకులకు బోర్‌ కొట్టే ప్రమాదం ఉంది. అందుకే హీరోలు హీరోయిన్స్‌ ఇతర నటీ-నటు-లు ఎప్పుడూ ఒకేలా కాకుండా విభిన్నంగా కనిపించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అందులో భాగంగానే సిక్స్‌ ప్యాక్‌.. ఎయిట్‌ ప్యాక్‌ బాడీస్‌ అనే విషయం తెల్సిందే.


ఇప్పుడు తెలుగు సినిమా ఖ్యాతి అంతర్జాతీయ ఖ్యాతి గడించింది. ప్రాంతీయ సినిమా నుండి పాన్‌ ఇండి యా సినిమాగా మారింది. వ్యాపారం పెరిగింది. దీంతో మన హీరోలు సైతం సినిమా కోసం ఎలాంటి సాహసం చేయడాని-కై-నా రెడీ అవుతున్నారు. ఎప్పటికప్పుడు మేకో వర్‌ అవుతూ తమని తాము కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
సీనియర్‌ హీరోలు బాలకృష్ణ, చిరంజీవి ఈ విష యంలో ముందుం టారు. ఇటీవలే వచ్చిన వీరసింహా రెడ్డి, గాడ్‌ఫాదర్‌ చిత్రాల్లో వీరి కొత్త గెటప్‌లు చూడవచ్చు. మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ సైతం ‘రంగస్థలం’ సినిమా కోసం పూర్తిగా మేకోవర్‌ అయ్యారు. చిట్టిబాబు అనే గ్రామీ ణ మాస్‌ యువకుడిగా కనిపించి అందరినీ ఆకట్టు-కున్నారు. చెవిటి వాడిగా నటించడానికి కూడా చెర్రీ వెనకాడలేదు. ఆయన ప్రయత్నానికి ఫలితం లభించింది. సినిమా విజయం పొందిం, అవార్డులు వరించాయి.

ఇక అల్లు అర్జున్‌ కూడా ‘పుష్ప: ది రైజ్‌’ సినిమా కోసం పూర్తి భిన్నమైన లుక్‌ లోకి మారి అందరినీ ఆశ్చర్య పరిచారు. పొడవాటి జుట్టు-, గుబులు గడ్డంతో ఊర మాస్‌ అండ్‌ రగ్డ్‌ అవతార్‌ లో కనిపించారు. కూలీగా, లారీ డ్రైవర్‌ గా, ఎర్ర చందనం స్మగ్లర్‌ గా ఆకట్టు-కున్నాడు బన్నీ. ఇప్పుడు పుష్ప: ది రూల్‌ సినిమాతో మరోసారి సరికొత్తగా ఆవిష్కరించుకోడానికి రెడీ అవుతున్నారు.
నేచురల్‌ స్టార్‌ నాని ‘దసరా’ సినిమా కోసం ఊర మాస్‌ అవతార్‌ లోకి మారిపోయాడు. చింపిరి జుట్టు-, కోర మీసాలతో ఎన్నడూ లేని విధంగా కనిపించారు. ఈ సినిమా సైతం హిట్‌ అయింది. లుక్‌ విషయంలో ప్రయో గాలు చేయని మాస్‌ మహారాజా రవితేజ.. ఇప్పుడు ‘-టైగర్‌ నాగేశ్వరరావు’ సినిమా కోసం గెటప్‌ మార్చారు. ఇప్పటికే రిలీజైన ప్రీ లుక్‌ పోస్టర్‌ లో చేతిలో కొరడాతో ఒంటి మీద చొక్కా లేకుండా కనిపించింది ఆశ్చర్య పరిచారు.
ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ పోతినేని.. ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమాలో మాసీ లుక్‌ తో కనిపించారు. ప్రస్తుతం బోయ పాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్న పాన్‌ ఇండియా చిత్రం లో సైతం రామ్‌ పక్కా మాస్‌ గెటప్‌ లో కనిపిస్తున్నారు.
కామెడీ హీరో ఇమేజ్‌ ఉన్న అల్లరి నరేశ్‌ సైతం ‘నాంది’ సినిమాతో లుక్‌ మార్చి హిట్టు- కొట్టిన సంగతి తెలిసిందే. సుధీర్‌ బాబు తన కొత్త చిత్రం కోసం ఒక్కసా రిగా లడ్డూ బాబులా మారిపోయి అందరికీ షాక్‌ ఇచ్చాడు. ‘మామా మశ్చీంద్ర’ సినిమాలో తన పాత్ర కోసమే ఇలాం టి లుక్‌లోకి మారిపోయాడు. ఈ చిత్రంలో దుర్గ అనే ఉబకాయుడుగా సుధీర్‌ నటిస్తున్నాడని తెలిసింది. ఇలా పలువురు యువ హీరోలు ఎలాంటి పాత్రలో అయినా ఒదిగేందుకు సిద్దంగా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement