Friday, April 26, 2024

వెంకీ మామని కలిసిన శ్రీ విష్ణు

శ్రీ విష్ణు హీరోగా హసిత్ గోలి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం రాజ రాజ చోర. కామెడీ ఎంటర్టైనింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీ విష్ణు సరసన మేఘా ఆకాశ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక మామూలు డిఫరెంట్ స్టోరీస్ తో ప్రేక్షకులు ముందుకు వస్తూ ఉంటారు శ్రీవిష్ణు. ఇక ఇది కూడా కొత్త కాన్సెప్ట్ అనే అర్థం అయిపోతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన సాంగ్స్, లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక మరోవైపు రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది.

కాగా ఈ రోజు శ్రీ విష్ణు విక్టరీ వెంకటేష్ ను కలిశారు. ఇదే విషయాన్ని చెబుతూ… ఆగస్టు 19న ప్రేక్షకులంతా థియేటర్ కు వచ్చి ఆశీర్వదిస్తారు. అంతకన్నా ముందు వెంకటేష్ గారి ఆశీర్వాదం తీసుకోవడానికి ఆయన దగ్గరికి వచ్చాను అంటూ వెంకటేష్ తో దిగిన ఫోటో ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు శ్రీ విష్ణు. అలాగే ఈ సినిమాపై కాస్త గట్టిగానే నమ్మకం పెట్టుకున్నాడు ఈ యంగ్ హీరో. మరి ఈ సినిమా ఏ మేరకు ఫలితాన్నిస్తుందో చూడాలి.

https://m.facebook.com/story.php?story_fbid=388572332625218&id=100044173639504

Advertisement

తాజా వార్తలు

Advertisement