Monday, May 6, 2024

ముద్దు పెట్టనేల‌.. మూతి తుడ‌వ‌నేలా

బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ ఎంతోమంది అమ్మాయిల‌ని హీరోయిన్ లుగా సినీ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసిన సంగ‌తి తెలిసిందే. వారిలో హీరోయిన్ జాక్వెలిన్ కూడా ఉంది. కాగా ఓ వీడియో వైర‌ల్ గా మారింది. జాక్వెలిన్ ని ముద్దు పెట్టుకున్నాడు స‌ల్మాన్ ఖాన్. ఈక్రమంలోనే సల్మాన్ ఖాన్, జాక్వెలిన్ కు సబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో సల్మాన్ ఖాన్ జాక్వెలిన్ కి వరుసగా రెండు సార్లు ముద్దు పెట్టారు. ఆ తర్వాత పక్కకు వెళ్ళి.. తన పెదాలను టీ షర్ట్ కి తుడుచుకున్నారు. ఇది చూసిన వారు షాక్ అవుతున్నారు.. అసలు సల్మాన్ ఎందుకు ఇలా చేసి ఉంటాడు అని అంతా చర్చించుకుంటున్నారు. ఒక షూటింగ్ సెట్స్ లో ఇది జరగ్గా.. వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఒక పక్కన నిలుచుని ఉండగా.. సల్మాన్ ఖాన్ ఆమె బుగ్గపై ముద్దు పెట్టారు. జాక్వెలిన్ నవ్వుకుంటుంటే.. సల్మాన్ ఖాన్ పక్కకు వెళ్ళిపోయి తన మూతిని టీ షర్ట్ తో తుడుచుకున్నారు. అస‌లు స‌ల్మాన్ అలా ఎందుకు పెదాల‌ను తుడుచుకున్నాడో అని తెగ ఆలోచిస్తున్నారు నెటిజ‌న్స్.

Advertisement

తాజా వార్తలు

Advertisement