Sunday, May 19, 2024

జెనీలియా ముందు సిగ్గుపడుతున్న రామ్.. ఎందుకో తెలుసా ?

రామ్ పోతినేని హీరోగా, జెనీలియా హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం రెడీ. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. రామ్ జెనీలియా ఇద్దరికీ కూడా మంచి పేరును తీసుకువచ్చింది. అయితే ఈ ఇద్దరు కూడా అప్పటి నుంచి మంచి స్నేహితులు.

తాజాగా ఈ ఇద్దరూ కలుసుకున్నారు. అంతే కాదు ఇంస్టాగ్రామ్ లోని రీల్స్ కూడా చేశారు. రెడీ సినిమా లోని అయ్యో… అయ్యో.. అయ్యో దానయ్య ఈ కుర్రాలంతా బకరాగాళ్లయ్యా అంటూ సాగే పాటకు రీల్స్ చేశారు. అందుకు సంబంధించిన వీడియో ను పోస్ట్ చేసిన జెనీలియా అయ్యో… అయ్యో అయ్యో ..బాబు గారు ఫస్ట్ టైం రీల్స్ చేస్తున్నారు కదా.. సిగ్గు పడుతున్నారు అంటూ టాగ్ లైన్ తగిలించింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

https://www.instagram.com/reel/CMbUKXtDwWS/?igshid=em1bn50u9kxg

Advertisement

తాజా వార్తలు

Advertisement