Sunday, May 5, 2024

సేంద్రియ వ్యవసాయంలోకి దిగిన స్టార్ హీరో

గతేడాది కరోనా మహమ్మారి కారణంగా షూటింగ్ లు నిలిచిపోయాయి. దీంతో స్టార్స్ అందరూ కూడా ఇంటికే పరిమితమయ్యారు. ఎప్పుడూ షూటింగ్ లతో బిజీగా బిజీగా గడిపే స్టార్స్ ఇంటికే పరిమితం కావడంతో… వ్యాయామాలు, వంటలతో ఇంటిలో కుటుంబంతో హ్యాపీగా గడిపారు.

తాగా తాజాగా మోహన్ లాల్ ఆర్గానిక్ ఫార్మింగ్ మీద దృష్టి పెట్టారు. షూటింగ్ లు లేకపోవడంతో ఎర్నాకులం లోని తన ఇంటి పక్కనే ఉన్న విశాలమైన స్థలంలో వంకాయ, దోసకాయ, సొరకాయ కూరగాయలు పండించారు. అంతేకాకుండా సేంద్రియ వ్యవసాయం విషయంలో తన తోటి నటీనటులు అభిమానులకు అవగాహన కల్పించారు. దీనికి సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా లో షేర్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement