Thursday, April 18, 2024

తెలుగు ద‌ర్శ‌కుడికి ఓకే చెప్పిన దుల్క‌ర్ స‌ల్మాన్

మ‌ల‌యాళ హీరో అయినా తెలుగు ప్రేక్ష‌కుల‌కి సుప‌రిచితుడే హీరో దుల్కర్ స‌ల్మాన్..ఆయ‌న కింగ్ ఆఫ్‌ కొత అనే మలయాళ సినిమా చేస్తున్నాడు. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్టులో రిలీజ్‌ కానుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా దుల్కర్‌ మరో తెలుగు సినిమాకు కమిట్‌ అయ్యాడు. ఇటీవలే సార్‌తో తిరుగులేని విజయాన్ని సాధించిన వెంకీ అట్లూరీ దర్శకత్వంలో దుల్కర్‌ తన తదుపరి సినిమా చేయబోతున్నాడు. బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్లతో జోరుమీదున్న సితార సంస్థ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుంది. తాజాగా మేకర్స్‌ఉ ఈ కాంబోపై అధికారికంగా ప్రకటన చేసింది. ఈ మేరకు వెంకీ అట్లూరి, దుల్కర్‌ సల్మాన్‌, నాగవంశీ ముగ్గురు కలిసి దిగిన ఫోటోను నెటిజన్లతో పంచుకున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా అక్టోబర్‌లో సెట్స్‌ మీదకు వెళ్లనుంది. ఇక వచ్చే ఏడాది సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇప్ప‌టికే సీతారామం చిత్రంతో మాంచి విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్నాడు దుల్క‌ర్.

Advertisement

తాజా వార్తలు

Advertisement