Tuesday, June 18, 2024

ఆ అమ్మాయితో హీరో ఆర్యకి సంబంధం లేదు

తమిళ స్టార్ హీరో ఆర్య గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ఆర్య… ఇటీవల చీటింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నాడు. శ్రీలంకకు చెందిన ఓ అమ్మాయి… హీరో ఆర్య తనను మోసం చేసి 70 లక్షల రూపాయలు తీసుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు అసలు నేరస్థులను గుర్తించారు.

చెన్నై పులియాందోపుకు చెందిన మ‌హ్మ‌ద్ అర్మాన్‌, మ‌హ్మ‌ద్ హుస్సేనీ అనే ఇద్ద‌రు వ్య‌క్తులు హీరో ఆర్య పేరు చెప్పి.. స‌ద‌రు శ్రీలంక మ‌హిళ‌ను మోసం చేశారని పోలీసులు గుర్తించారు. వారి వాట్స‌ప్ చాట్‌ను కూడా బ‌య‌ట పెట్టారు పోలీసులు. ఈ కేసు కు ఆర్య కు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. అయితే త‌న ప్ర‌మేయం లేకుండా త‌న‌పై అప‌వాదు రావ‌డంతో ఎంతో బాధ‌ప‌డ్డాన‌ని…ఆ స‌మ‌యంలో త‌న‌కు బాస‌ట‌గా నిలిచిన అంద‌రికీ థాంక్స్ అని అన్నారు ఆర్య.

Advertisement

తాజా వార్తలు

Advertisement