Friday, March 29, 2024

RRR: షూటింగ్ మొత్తం పూర్తి..

ఎన్టీఆర్, రామ్ చరణ్‌ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తీస్తున్న ప్యాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ మొత్తం పూర్తయింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థలు ట్వీట్ ద్వారా తెలియచేశాయి. ఇటీవల ఉక్రెయిన్ లో చేసిన చివరి షెడ్యూల్ తో ఈ సినిమా మొత్తం పూర్తయింది. ఒకటి రెండు పికప్ షాట్స్ తప్ప సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిందని, నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని, రిలీజ్ తదితర ఇతర అప్ డేట్స్ ని వీలయినంత త్వరగా ప్రకటిస్తామని మీడియాకు తెలియచేశాయి. అక్టోబర్ లో విజయదశమి కానుకగా విడుదల అవుతుందని అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే సినిమా విడుదలపై సప్పెన్స్ నెలకొంది. వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ అవుతుందని సోషల్ మీడియాలో వినిపిస్తోంది. మరి చెప్పినట్లుగా రాజమౌళి అండ్ కో దసరాకే రిలీజ్ చేస్తారా? లేక సంక్రాంతికి వాయిదా వేస్తారా? అన్నది తేలాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: కోహ్లీ వెంటనే సచిన్ సలహా తీసుకో: గవాస్కర్

Advertisement

తాజా వార్తలు

Advertisement