Sunday, October 6, 2024

ఫ్యామిలీతో ఉదయ్ పూర్ కి ప‌వ‌న్ క‌ల్యాణ్ .. వీడియో ఇదిగో

సినిమాల‌తో ఒక‌ప‌క్క‌..రాజ‌కీయాల‌తో మ‌రోప‌క్క బిజీ బిజీగా ఉన్నారు జ‌న‌సేన అధినేత‌.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్. కాగా పవన్ తన ఫ్యామిలీకి ఆటవిడుపుగా చిన్న సమ్మర్ వెకేషన్ ప్లాన్ చేశారు. తన భార్య అన్నా లెజినోవా.. చిన్న కుమారుడు మార్క్ శంకర్, కుమార్తె పోలేనాతో కలసి రాజస్థాన్ టూర్ వెళ్లారు. ఉదయ్ పూర్ ఎయిర్ పోర్ట్ లో పవన్ కళ్యాణ్ తన ఫ్యామిలీతో వెళుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన తల్లి లెజినోవా చేయి పట్టుకుని మార్క్ శంకర్ బుడి బుడి అడుగులతో సందడి చేశాడు. ఈ దృశ్యాలు పవన్ ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మార్క్ శంకర్ ని పాయింట్ చేస్తూ పవన్ ఫ్యాన్స్ వీడియో క్లిప్పింగ్స్, ఫోటోలని వైరల్ చేస్తున్నారు. వెకేషన్ నుంచి తిరిగి రాగానే పవన్ కళ్యాణ్ ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల షూటింగ్ ప్రారంభిస్తారని టాక్. ఓజి చిత్రం సుజీత్ దర్శకత్వంలో, డివివి దానయ్య నిర్మాణంలో తెరకెక్కనుంది. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న సంగ‌తి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement