Sunday, April 28, 2024

రాష్ట్రంలో ప్రభుత్వ భూములు అమ్మకానికి పెట్టారు : సీఎల్పీ నేత భ‌ట్టి

బెల్లంపల్లి ఏప్రిల్ 1 (ప్రభ న్యూస్) : తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ భూములను అమ్మకానికి పెట్టారని సీఎల్పీ నేత భ‌ట్టి విక్రమార్క మండిపడ్డారు. శనివారం బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండలం ఆవడంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నీళ్లు నిధులు నియమకాలు పేరుతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజలకు ఏ ఒక్కటి అందడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని రాష్ట్ర రాజధాని హైదరాబాద్ చుట్టూ ఉన్న భూములను అమ్మడానికి వేలం పెట్టాడని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు అందించాల్సిన ఈ భూములను పథకాల కోసం అమ్మకానికి పెట్టడం సిగ్గుచేటన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేదలకు ఇందిరమ్మ కాలనీలో ఏర్పాటుచేసి ఇండ్లను పంపిణీ చేయడం జరిగిందని, పేద మధ్యత మధ్యతరగతి చిన్నచిన్న ఉద్యోగస్తులకు కార్పొరేషన్, దిల్ ద్వారా, హౌసింగ్ బోర్డ్ ద్వారా ఇండ్లను నిర్మించి నిర్ణీత రేటుకు అందజేయడం జరిగిందని తెలిపారు. అలాంటి హౌసింగ్ కార్పొరేషన్, హౌసింగ్ బోర్డ్, దిల్ లను తెలంగాణ ప్రభుత్వం ఎత్తివేసిందని పేర్కొన్నారు. ప్రభుత్వ భూములను 15, 20 వేల కోట్ల రూపాయలకు అమ్మకానికి పెట్టిందని దీనిని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ దానిని మర్చిపోయారని వెంటనే నిరుద్యోగులకు నాలుగు సంవత్సరాలతో డబ్బులతో కలిపి నిరుద్యోగ భృతి అందజేయాలని డిమాండ్ చేశారు. ఇలా తప్పుడు హామీలతో మోసం చేసి గద్దెనెక్కిన ప్రభుత్వంపై చీటింగ్ కేసు పెట్టాలని అన్నారు. బెల్లంపల్లి నియోజకవర్గం లోని నెన్నెల మండలం చిన్న వెంకటాపూర్ గ్రామ పంచాయతీలోని పొట్యాల గ్రామంలో గత కొన్ని దశాబ్దాలుగా చేసుకుంటున్న భూములను బీఆర్ఎస్ ప్రభుత్వం, అడవి అధికారులు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని, అక్కడి గ్రామస్తులు తన దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. వారి భూములను వారికే దక్కేలాగా పోరాటం చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే గిరిజనులకు ఆదివాసులకు పోడు భూములపై పట్టాలు ఇస్తామని తెలిపారు. గతంలోని పార్లమెంట్ లో పోడు భూములపై బిల్లు చేసినప్పటికీ, ప్రభుత్వం పార్లమెంటును ధిక్కరించి రాజ్యాంగాన్ని ధిక్కరిస్తుందని మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement