Friday, April 26, 2024

ఆర్ ఆర్ ఆర్ సాంగ్ పై హైప్ తీసుకొచ్చిన హేమచంద్ర

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ ఆర్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు అజయ్ దేవగన్ అలాగే అలియాభట్ నటిస్తున్నారు. ఇక ఈ సినిమా పై హైప్ మరింత ఎక్కువగా పెంచేందుకు రాజమౌళి శతవిధాల ప్రయత్నిస్తున్నాడు. అందులో భాగంగానే ఫస్ట్ సాంగ్ ని విడుదల చేసి ట్రెండ్ సృష్టించాలని చూస్తున్నారు. దోస్తీ అంటూ సాగే ప్రమోషనల్ సాంగ్ 5 భాషలలో ఐదుగురు సింగర్లతో సిద్ధం చేశారు.

ఆగస్టు ఒకటో తారీఖున ఈ దోస్తీ సాంగ్ రిలీజ్ కాబోతోంది. ఇక తెలుగులో హేమచంద్ర ఈ పాటను పాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఇది ఖచ్చితంగా కల నెరవేరిన రోజు . ఇది గొప్ప అదృష్టం. ఈ పాట ఎలా వచ్చింది ఎంత గొప్పగా వచ్చింది అనేది మాటల్లో చెప్పలేకపోతున్నాను. ప్రతి పాట పాడేటప్పుడు ఒత్తిడి ఉంటుంది. ఇలాంటి సినిమాలలో పడేటప్పుడు ఎక్కువగా ఉంటుంది. ప్రమోషనల్ వచ్చిన తీరు మైండ్ బ్లోయింగ్. ఇక సీతారామశాస్త్రి గారి లిరిక్స్ అద్భుతంగా ఉన్నాయి. సూపర్ గా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు హేమచంద్ర.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement