Saturday, April 27, 2024

రామ్ చరణ్ ప్రొడక్షన్‌ లో.. తొలి హీరోగా నిఖిల్

నిర్మాణ‌రంగంలోకి అడుగుపెట్టారు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్. ఇటీవలే యూవీ క్రియేషన్స్‌ నిర్మాత విక్రమ్‌తో కలిసి వి మెగా పిక్చర్స్‌ అనే కొత్త ప్రొడక్షన్‌ సంస్థను స్టార్ట్‌ చేశారు. కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్‌ చేసే క్రమంలో ఈ ప్రొడక్షన్‌ సంస్థను స్టార్ట్‌ చేసినట్లు ఈ సంస్థ తెలిపింది. తాజాగా ఈ సంస్థ తమ మొదటి సినిమాను ప్రకటించింది. బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్లతో దూసుకుపోతున్న హీరో నిఖిల్‌తో తొలి చిత్రాన్ని చేయనున్నట్లు ఈ సంస్థ వెల్లడించింది. ఈ సినిమాకు ది ఇండియా హౌజ్‌ అనే పేరును ఫిక్స్‌ చేశారు. రామ్‌ వంశీ కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాను అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌తో కలిసి వి మెగా పిక్చర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తుంది.
ఈ మేరకు చిత్రబృందం ఓ స్పెషల్ వీడియోను రిలీజ్‌ చేసింది 1900 దశకం సమయంలో భారతదేశ చరిత్ర పుటల్లో లేని ఒక అధ్యాయాన్ని ఈ సినిమాలో చూపించనున్నట్లు చిత్రబృందం వీడియోలో పేర్కొంది. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమా లండన్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనుంది. నిఖిల్‌ ఈ సినిమాలో శివ అనే పాత్రలో నటిస్తున్నాడు. ఏజెంట్ గెటప్‌లో సూట్‌కేసు పట్టుకున్న నిఖిల్‌ లుక్ అదిరిపోయింది. అనుపమ్‌ ఖేర్‌ కీలకపాత్రలో నటిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement