Tuesday, September 26, 2023

ధాన్యం బస్తాలతో.. జాతీయ రహదారిపై ఆందోళన

చెన్నూర్: మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలా ఎల్లక్కపేట ఐకేపీ కొనుగోలు కేంద్రం ఎదురుగా ఉన్న 63 జాతీయ రహదారి పై సమీప గ్రామాల రైతులు ఐకేపీ సెంటర్ లో నిల్వ ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతూ ధాన్యం బస్తాలతో ఆందోళన చేశారు. గత 20 రోజులుగా ఐకేపీ సెంటర్లకు లారీలు రావడం లేదనే సాకు తో కొనుగోలు చేయకపోవడం తో తాము ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆరోపిస్తున్నారు. అధికారులు తక్షణమే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు .లేనట్లయితే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement