Thursday, May 2, 2024

పవర్ స్టార్ కొత్త సినిమా మేకింగ్ వీడియో చూసారా ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ వారు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ సాధించిన అయ్యప్పనుమ్ కొషియమ్ చిత్రానికి రీమేక్. అయితే ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే మాటలు అందిస్తున్నారు.

ఇదిలా ఉండగా కరోనా కారణంగా వాయిదా పడ్డ ఈ సినిమా షూటింగ్ తాజాగా సోమవారం స్టార్ట్ అయింది. ఇక పవన్ కళ్యాణ్ కూడా షూటింగ్ లో పాల్గొన్నాడు. తాజాగా ఈ సినిమాపై క్రేజ్ ను పెంచేందుకు చిత్ర యూనిట్ ఓ మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది. ఆ వీడియో లో పవన్ కళ్యాణ్, రానా, త్రివిక్రమ్, సాగర్, మొదలైనవారు కనిపించారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement