Saturday, October 12, 2024

అభిమానులు కాలర్ ఎగరేసుకునే సినిమా హరిహర వీరమల్లు!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం హరిహర వీరమల్లు. భారీ అంచనాల మధ్య పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉండగా ప్రముఖ మాటల రచయిత ఈ సినిమా పై చేసిన కామెంట్ ఇప్పుడు మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.

ఈ సినిమా విడుదల అయ్యాక మరో స్థాయిలో ఉంటుందని పవన్ అభిమానులు కాలర్ ఎగరేసే విధంగా ఈ చిత్రం ఉండబోతోందని చెప్పుకొచ్చారు సాయి మాధవ్ బుర్రా. ఇక ఈ సినిమా కు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement