Friday, May 3, 2024

హ్యాపీ బ‌ర్త్ డే అఖిల్ .. లాట్స్ ఆఫ్ ల‌వ్.. ట్వీట్ చేసిన స‌మంత‌

యంగ్ హీరో అఖిల్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ట్వీట్ చేసింది స్టార్ హీరోయిన్ స‌మంత‌. హ్యాపీ బర్త్‌డే అఖిల్‌ అక్కినేని. ఏయ్‌.. ఏజెంట్‌ 28న రాబోతుంది. చూస్తుంటే ఫైర్‌లా ఉంది.. లాట్స్‌ ఆఫ్‌ లవ్‌’ అంటూ హార్ట్‌ ఎమోజీని జతచేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అఖిల్ లేటెస్ట్‌ సినిమా ఏజెంట్‌ సక్సెస్‌ అవ్వాలంటూ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పోస్ట్‌ పెట్టింది. ఏజెంట్‌ సినిమా పోస్టర్‌ను షేర్‌ చేసిన సామ్‌.. కాగా గతేడాది కూడా అఖిల్‌ బర్త్‌డే సందర్భంగా సామ్‌ విషెస్‌ చెప్పింది. అయినా అఖిల్‌ స్పందించలేదు. మరి ఈసారైనా సమంత షేర్‌ చేసిన పోస్ట్‌కు రిప్లై ఇస్తాడా లేదా అన్నది చూడాలి. కాగా నాగచైతన్యతో విడిపోయినా అక్కినేని కుటుంబంతో మాత్రం సమంతకు ఇప్పటికీ మంచి అనుబంధం ఉందన్నది పలుమార్లు రుజువైంది. ముఖ్యంగా అఖిల్‌, సుశాంత్‌ సినిమాలు రిలీజైనప్పుడల్లా విషెస్‌ చెబుతూ సోషల్‌ మీడియాలో పోస్టులు షేర్‌ చేస్తుంటుంది. ఇటు దగ్గుబాటి ఫ్యామిలీలోనూ రానా, మిహికా, వెంకటేష్‌ కూతురు అశ్రితతోనూ సామ్‌ కు మంచి టరమ్స్‌ ఉన్నాయి.సామ్‌ మయోసైటిస్‌ బారిన పడ్డప్పుడు అఖిల్‌, దగ్గుబాటి రానా, సుశాంత్, అశ్రిత తదితరులు సమంతకు ధైర్యం చెబుతూ పోస్టులు షేర్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement