Monday, April 15, 2024

HanuMan ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే !

ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో తేజా సజ్జ హీరోగా నటించిన లేటెస్ట్ సూపర్ హీరో మూవీ ‘హనుమాన్’. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలైన ఈ సినిమా బాక్స్‌ఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. కాగా, తాజాగా ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అయ్యింది.

ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ రిలీజ్ చేసింది. ‘హనుమాన్’ స్ట్రీమింగ్ రైట్స్‌ను భారీ ధరకు దక్కించుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5.. ఈ సినిమాను శివరాత్రి కానుకగా మార్చి 8న ఓటీటీలో విడుదల చేయనున్నట్టు ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement