Friday, May 3, 2024

Hanuman – 12 కోట్ల సినిమాకు వంద కోట్ల క‌లెక్ష‌న్ ….

యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో, తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హీరో మూవీ హను మాన్. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంటుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 న రిలీజైన ఈ సినిమా సెన్సేషన్ రెస్పాన్స్ తో దూసుకు పోతుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ చిత్రం ఇప్పటికే బ్రేక్ ఈవెన్ సాధించి, ప్రాఫిట్స్ లోకి అడుగు పెట్టింది.

అయితే కేవలం నాలుగు రోజుల్లో 100 కోట్ల రూపాయల క్లబ్ లో చేరింది. పండుగ అయిపోయినా ధియేట‌ర్ల‌కు ప్రేక్ష‌కులు పోటేత్తుతున్నారు.. తెలుగు రాష్ట్రాల‌లో కేవ‌లం 300 ధియేట‌ర్ల‌లో రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పుడు ఏకంగా 600 ధియేట‌ర్ల‌లో ప్ర‌ద‌ర్శిస్తుండ‌టం విశేషం… అన్ని భాష‌ల‌లోనూ స‌క్సెస్ టాక్ తో న‌డుస్తుంటంతో ఈ మూవీ రెండు వంద‌ల కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్స్ రావ‌చ్చ‌ని భావిస్తున్నారు..


చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి ఈ రేంజ్ వసూళ్లను రాబట్టడం సెన్సేషన్ అని చెప్పాలి. ఈ చిత్రం లో అమృత అయ్యర్ లేడీ లీడ్ రోల్ లో నటించగా, వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement