Friday, May 3, 2024

హన్సిక 105 మినిట్స్ ఫస్ట్ లుక్

హీరోయిన్ హన్సిక గురించి సినీ అభిమానులకు కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. తెలుగు, తమిళ, హిందీ భాషలలో ఎన్నో సినిమాలలో నటించిన హన్సిక ప్రస్తుతం రాజ్ దుస్స డైరెక్షన్ లో 105 మినిట్స్ అనే సినిమా చేస్తోంది. ఈ సినిమా తో మునుపెన్నడూ లేని విధంగా సరికొత్త ప్రయోగం చేస్తున్నారు దర్శక నిర్మాతలు.

ఒకే ఒక్క క్యారెక్టర్ తో అసలు ఎడిటింగ్ లేకుండా సింగల్ షాట్ తో సినిమా తీస్తున్నారట. అయితే తాజాగా హీరోయిన్ హన్సిక పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అంతే కాకుండా యూ కాంట్ సీ కెన్ హర్ట్ యూ అనే ట్యాగ్ లైన్ ఇచ్చారు. పోస్టర్ చూస్తుంటే ఇది ఒక హర్రర్ చిత్రం గా తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement