Saturday, May 4, 2024

శిల్పాశెట్టికి సినీస్టార్స్ నుంచి పెరుగుతున్న మద్దతు

రాజ్ కుంద్రా వ్యవహారంలో ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటున్న శిల్పా శెట్టిటికి సినీ స్టార్స్ నుంచి మద్దతు ఎక్కువవుతోంది. న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని తాను అనని మాటల్ని ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేస్తూ సోషల్ మీడియా పోస్ట్ పెట్టింది శిల్ప. ముఖ్యంగా ఒక తల్లిగా తన పిల్లల కోసం అభ్యర్థిస్తున్నాను అని ప్రైవసీకి విలువ ఇవ్వండంటూ కోరింది. ఇదే విషయమై సినీస్టార్ ఆమెకు సపోర్ట్ గా నిలుస్తున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెబుతూనే సోషల్ మీడియాలో శిల్పాశెట్టి పై జరుగుతున్న ట్రోలింగ్ మంచిది కాదని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

నువ్వు అత్యంత శక్తివంతమైన దానివి అంటూ హీరో మాధవన్ సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చాడు. శిల్ప అన్ని సవాళ్లను గంభీరంగా ఎదుర్కొంటుందని తెలిపాడు. అలాగే నటి రిచా చద్దా స్పందిస్తూ… మగవాళ్లు చేసే తప్పులకు ఆడ వాళ్ళని నిందించటం మనకు ఆటగా మారింది. అలాంటి వారిని శిల్పా శెట్టి కోర్టుకు ఈడ్చుతుండటం సంతోషించాల్సిన విషయం అంటూ చెప్పుకొచ్చారు. అలాగే వరుణ్ ధావన్, జాక్వలిన్ ఫెర్నాండెజ్, అనిరుద్ దవే ఇలా చాలామంది శిల్ప శెట్టి కి మద్దతుగా నిలుస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement