Thursday, April 25, 2024

14న సూర్య42 టైటిల్ గ్లింప్స్.. ప్రకటించిన మేకర్స్

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో డైరెక్టర్ శివ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ సూర్య42. స్టూడియో గ్రీన్ పతాకం యూవీ క్రియేషన్స్ తో కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. టైటిల్ గ్లింప్స్ ను మార్చ్ 14, 2023 న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించడం జరిగింది. ఈ చిత్రం ను అనౌన్స్ చేసినప్పటి నుండి సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఈ టైటిల్ గ్లింప్స్ కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సూర్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో దిశ పఠాని హీరోయిన్ గా నటిస్తుంది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ భారీ చిత్రం కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement