Sunday, April 28, 2024

డిజిట‌ల్ ఎంట్రీ ఇవ్వ‌నున్న గంగూబాయి..

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియాభ‌ట్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌క్కెక్కిన లేటెస్ట్ మూవీ ‘గంగూబాయి క‌ఠియావాది’. సంజ‌య్ లీలా భ‌న్సాలీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 25న విడుద‌లైంది. మొద‌టి షో నుంచే ఈ సినిమా మంచి పాజిటీవ్ టాక్ దక్కించుకుని బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి క‌లెక్ష‌న్ల‌ను రాబ‌డుతుంది. ఈ సినిమాతో అలియా వంద కోట్ల క్ల‌బ్‌లో చేరింది. ఈ చిత్రంలో ఆలియా న‌ట‌నకు ప్రేక్ష‌కులే కాకుండా విమ‌ర్శ‌కుల‌ నుంచి మంచి ప్ర‌శంస‌లు ద‌క్కాయి. అయితే తాజాగా ఈ చిత్రం డిజిట‌ల్ స్ట్రీమింగ్ కానున్న‌ట్లు తెలుస్తుంది.

మార్చి 25 నుంచి ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ విడుద‌లైన నాలుగు వారాల త‌ర్వాత డిజిట‌ల్ స్ట్రీమింగ్ చేయాల‌ని నెట్‌ఫ్లీక్స్ సంస్థ ఈ సినిమా మేక‌ర్స్‌తో డీల్ కుదిరించుకుంద‌ని సమాచారం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement