Wednesday, May 1, 2024

నాకు సెక్స్ రాకెట్ కు సంబంధం లేదు…బాలయ్య హీరోయిన్

నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నరసింహనాయుడు సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలోని బాలకృష్ణ డైలాగులు అలాగే సంగీతం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే ఆ సినిమాలో లక్స్ పాప లక్స్ పాప అంటూ బాలయ్య తో అదిరిపోయే స్టెప్స్ వేసింది ఫ్లోరా షైనీ. తాజాగా ఈ అమ్మడు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

సెక్స్ రాకెట్ కేసులో అరెస్ట్ అయిన శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా ను అరెస్టు చేసి విచారిస్తుండగా… ఈ అమ్మడికి సంబంధాలు ఉన్నట్లు వార్తలు బయటకు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేదని ఫ్లోరా షైనీ క్లారిటీ ఇచ్చింది. ఇంస్టాగ్రామ్ వేదికగా ఓ వీడియో ద్వారా ఈ విషయాన్ని తెలిపింది. రాజ్ కుంద్రా సన్నిహితులు ఉమేశ్ కామథ్ తో షైనీ కి మంచి స్నేహ సంబంధం ఉందని ఈ సెక్స్ రాకెట్ విషయంలో ఈ అమ్మడికి కూడా సంబంధం ఉందని వార్తలు రాగా వాటిపై క్లారిటీ ఇస్తూ… ఉమేష్ కామత్ గాని పోర్న్ రాకెట్ కేసులో గానీ తనకు ఎలాంటి సంబంధం లేదని అవన్నీ పుకార్లేనని చెప్పుకొచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement