Friday, April 26, 2024

ఎఫ్3 రిలీజ్ వాయిదా

అనిల్ రావిపూడి దర్శకత్వం లో విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్ హీరోలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఎఫ్2. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ సరసన తమన్నా నటించగా, వరుణ్ తేజ్ సరసన మెహరీన్ నటించింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించడంతో పాటు నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా ఎఫ్3 సినిమా తెరకెక్కుతోంది.

ఈ సినిమాలో వారితో పాటు సునీల్, అంజలి కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల కరోనా కారణంగా చాలావరకు సినిమా షూటింగ్ లు నిలిచిపోయాయి. దీంతో రిలీజ్ డేట్స్ కూడా వాయిదా వేసుకుంటున్నారు. మొదట ఈ చిత్రాన్ని ఆగస్టు 27న విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. కానీ ఇప్పుడు రిలీజ్ డేట్ ను వాయిదా వేసుకుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి విడుదల తేదీని వాయిదా వేస్తున్నట్లు అనిల్ రావిపూడి స్పష్టం చేశారు. కొత్త రిలీజ్ డేట్ ను త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు అనిల్.

Advertisement

తాజా వార్తలు

Advertisement