Tuesday, April 30, 2024

F3 ఫుల్ జోష్.. రెండు రోజుల్లో 18.77 కోట్ల కలెక్షన్స్

వెంకటేష్ వరుణ్ తేజ్ నటించిన ‘ఎఫ్ 3’ అనూహ్యంగా మంచి ప్రదర్శన కనబరిచింది అనిల్ రావిపూడి దర్శకత్వం వహించచిన ఈ సినిమాలో తమన్నా, మెహ్రీన్, సోనాల్ చౌహాన్, రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మ, సునీల్, అలీ ఇతరులు కూడా నటించారు. మూవీ రిలీజ్ అయిన ఫ‌స్ట్ డే నుంచే పాసిటివ్ టాక్ సంపాదించుకుంది. అయితే ఈ సినిమా కేవలం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే మోద‌టి రోజు 8.4 కోట్ల రూపాయలను వసూలు చేసింది, ఇక‌ రెండు రోజుల మొత్తం 18.77 కోట్లకు చేరుకుంది. ఈ సినిమా కుటుంబ ప్రేక్షకులను ఆకర్షిస్తున్నందున బాక్సాఫీస్ వసూళ్లు క్రమంగా పెరుగుతున్నాయి.

ఈ చిత్రం US బాక్సాఫీస్ వద్ద $750,000 కంటే ఎక్కువ వసూలు చేసిన‌ట్టు తెలుస్తుంది. ఇక‌ నైజాం ఏరియాలో రూ. 8.16 కోట్లు, యూఏ ఏరియాలో రూ. 2.23 కోట్లు వసూలు చేసింది. సీడెడ్ నుంచి రూ.2.41 కోట్లు, గుంటూరు నుంచి రూ.1.42 కోట్లు. కాగా తూర్పుగోదావరి ఏరియాలో రూ.1.28 కోట్లు. పశ్చిమ గోదావరి రూ.1.23 కోట్లు, కృష్ణా రూ.1.18 కోట్లు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement