Friday, May 3, 2024

పెళ్లి తరువాత అందరూ మారిపోతారు…రానా దగ్గుబాటి

దగ్గుబాటి రానా ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే గతేడాది కరోనా సమయంలో అతి తక్కువ మంది బంధువులు, సన్నిహితుల మధ్య తాను ప్రేమించిన మిహికా బజాజ్ ను వివాహం చేసుకున్నారు రానా. అయితే వైవాహిక జీవితం తనలో ఎన్నో మార్పులను తీసుకు వచ్చిందని చెబుతున్నారు రానా. పెళ్లి తర్వాత ఇలాంటి మార్పు అందరిలోనూ వస్తాయని చెప్పుకొచ్చారు. ముందుకన్నా ఇప్పుడు మరింత బాధ్యతాయుతంగా ఉంటున్నానని చెబుతున్నాడు. అంతేకాకుండా భార్య కారణంగానే తన పనులన్నీ చాలా సజావుగా సాగిపోతున్నాయి అని చెప్పుకొచ్చాడు రానా.

ఇక సినిమాల విషయానికొస్తే రానా నటించిన విరాటపర్వం సినిమా ఓటిటి లో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించగా… ప్రియమణి కీలక పాత్రలో నటిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement