Tuesday, March 26, 2024

పాన్ ఇండియా లెవ‌ల్ లో ‘దసరా’.. ట్రైలర్ లాంచ్ వెన్యూని ఫిక్స్ చేసిన మేక‌ర్స్

యువ దర్శకడు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్​లో, నాచురల్ స్టార్ నాని హీరోగా.. అందాల నటి కీర్తి సురేష్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ పాన్ ఇండియన్ మూవీ దసరా. ఈ నెల (మార్చి) 30న థియేట‌ర్ల‌లో రిలీజ్ అయ్యేందుకు రెడీగా ఉన్న ఈ మూవీ నుండి వ‌చ్చిన‌ ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఆడియన్స్ తోపాటు.. నాని ఫ్యాన్స్ ని ఎంతో ఆకట్టుకుని మూవీ పై భారీ అంచనాలు క్రియేట్ చేస్తున్నాయి. కాగా, ఈ మూవీ అఫీషియల్ ట్రైలర్ ని రేపు (మార్చి 14న) రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసారు.

ఇక.. తాజగా ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని లక్నోలోని ప్రతిభ థియేటర్ లో మధ్యాహ్నం 3.30గంటల నుండి గ్రాండ్ గా జరుపనున్నట్లు పోస్టర్ రిలీజ్ చేస్తూ ప్రకటించారు మేక‌ర్స్. తన సినీ కెరీర్ లో తొలిసారిగా ఐదు భాషల్లో రిలీజ్ అవుతున్న భారీ పాన్ ఇండియన్ మూవీ కావడంతో హీరో నాని ఇతర భాషల్లో కూడా ప్రమోట్ చేస్తున్నారు. కాగా దసరా మూవీని శ్రీలక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి భారీ వ్యయంతో నిర్మించగా.. సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement