Monday, October 7, 2024

Shah Rukh Khan: ఎవెూషనల్ జర్నీగా డంకీ

షారూక్‌ ఖాన్‌, రాజ్‌ కుమార్‌ హిరాణి కాంబినేషన్‌ చిత్రం డంకీ. ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకువస్తోంది. డంకీ సినిమాకు సంబంధించి అనేక హైలెట్స్‌ ప్రచారంలో ఉన్నాయి. డంకీ డ్రాప్‌ 2 అంటూ లుట్‌ పుట్‌ గయా పాటను విడుదల చేశారు. ప్రీతమ్‌ సంగీత సారథ్యంలో సోనూ నిగమ్‌ ఆలపించారు.

డంకీ డ్రాప్‌ 1 అంటూ అంతకంటే ముందుగానే మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. తాజాగా డంకీ డ్రాప్‌ 3 లోని నికలె ది కబీ హమ్‌ ఘర్‌ సే పాటను విడుదల చేశారు. నలుగురు స్నేహితులు విదేశాలకు వెళ్లాలని తాపత్రయ పడతారు. వారి భావోద్వేగ ప్రయాణంలో ఉండే ఆరాటాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. ఈ పాటలో భవిష్యత్తులో బావుండాలనే ఉద్దేశంతో విదేశాల్లో ఉంటుంటాు. అలాంటి వారు తమ మాతృదేశానికి దూరమై దానిపై చూపించే ప్రేమను ఈ పాటలో వెల్లడించే ప్రయత్నం చేశారు. రాజ్‌ కుమార్‌ హిరాణి, గౌరిఖాన్‌ నిర్మిస్తున్న చిత్రమిది.

Advertisement

తాజా వార్తలు

Advertisement