Friday, May 3, 2024

బిగ్ ప్రాజెక్ట్ నుంచి DSP వాక్ అవుట్.. కారణమేంటో తెలిస్తే షాక్​ అవుతారు!!

సంగీతం పట్ల ఒక్కొక్కరికీ ఒక్కో అభిరుచి ఉంటుంది. కానీ, అది వ్యక్తిని బట్టి మారుతూ ఉంటుంది.. ఏఆర్ రెహమాన్ ఆస్కార్ విన్నర్ అయినప్పటికీ ఆయన సంగీతం అంటే కొంతమందికి ఇష్టం ఉండదు. చాలామంది ప్రశంసలు పొందిన గాయకులను ద్వేషించే వారు కూడా ఉండవచ్చు. అదేవిధంగా, పుష్ప కోసం తన సంగీతంతో దేశాన్ని షేక్ చేసిన రాక్​స్టార్​, టాలీవుడ్ సంగీత దర్శకుడు DSP, ఒక సినిమా దర్శకుడికి నచ్చలేదట.. దీంతో స్వచ్ఛందంగానే ఆ ప్రాజెక్టు నుంచి దేవిశ్రీ తప్పుకున్నట్టు తెలుస్తోంది.

సల్మాన్ ఖాన్ మూవీ ‘భాయిజాన్’ సినిమాకు సంగీత దర్శకుడిగా DSP సంతకం చేశారు. అయితే.. దర్శకుడు ఫర్హాద్ సామ్జీకి DSP సంగీతం న‌చ్చ‌పోవ‌డంతో ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్టు సమాచారం. అయితే.. ఈ వివాదం నేపథ్యంలో తన నెక్స్ట్ ప్రాజెక్టులో చాన్స్​ ఇస్తానని డీఎస్పీకి స‌ల్మాన్ ఖాన్ మాట ఇచ్చినట్టు తెలుస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement