Sunday, April 28, 2024

ఓటీటీలో అడుగు పెడుతున్న “డాన్”..

రెమో’ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మయిన కార్తికేయ‌న్‌ గతేడాది విడుద‌లైన ‘డాక్ట‌ర్’ సినిమాతో టాలీవుడ్‌లో మంచి మార్కెట్‌ను ఏర్ప‌ర‌చుకున్నాడు. ఈ క్ర‌మంలోనే ఈయ‌న న‌టించిన ‘డాన్’ త‌మిళ్‌తో పాటు తెలుగులోనూ ఏక‌కాలంలో రిలీజ్ అయింది. లైకా ప్రొడ‌క్ష‌న్ సంస్థ‌తో క‌లిసి శివ కార్తికేయ‌న్ స్వీయ‌ నిర్మాణంలో ఈ చిత్రాన్ని సిబి.చ‌క్ర‌వ‌ర్తి ద‌ర్శ‌క‌త్వం వ‌హించగా గ‌తవారం థియేట‌ర్ల‌లో విడుద‌లై పాజిటీవ్ రివ్యూల‌ను తెచ్చుకుంది. కేవ‌లం 4రోజుల్లోనే ఈ సినిమా తెలుగు, త‌మిళ భాష‌ల్లో క‌లిపి 50కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. ఈ స్థాయిలో క‌లెక్ష‌న్లు సాధించిందంటే విశేషం అనే చెప్పాలి. ఈ మ‌ధ్య కాలంలో ఎంత‌టి భారీ విజ‌యం సాధించినా సినిమా అయినా స‌రే కేవ‌లం నెల రోజుల్లోనే ఓటీటీలోకి ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. కాగా ఈ చిత్రం ఓటీటీ విడుద‌ల‌కు సిద్ద‌మైంది.

రొమాంటిక్ కామెడీ డ్రామాగా విడుద‌లైన ఈ సినిమా ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ‌ ‘నెట్‌ఫ్లిక్స్‌’లో జూన్ 10నుంచి స్ట్రీమింగ్ కానుంది. అనురుధ్ ర‌విచంద్ర‌న్ సంగీతం అందించిన ఈ చిత్రంలో శివ‌కార్తికేయ‌న్‌కు జోడీగా ప్రియాంక అరుళ్‌ మోహ‌న్ హీరోయిన్‌గా న‌టించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement