Thursday, May 2, 2024

ఎన్టీఆర్ కొరటాల సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. అలాగే దీని తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. అయితే మొదట కొరటాల శివతో సినిమా చేస్తున్నప్పటికీ అందరి దృష్టి కూడా ప్రశాంత్ సినిమా పైనే ఉంది.

ఇక ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ సినిమా చేస్తున్నాడు. అయితే కొరటాల మాత్రం తన సినిమాకు సంబంధించి ఎటువంటి హైప్ ను క్రియేట్ చేయలేదు. కానీ తాజాగా ఆ సినిమాకు సంబంధించి ఓ వార్త బయటకు వచ్చింది. ఈ సినిమాను సుమారు 180 నుంచి 200 కోట్ల రూపాయలతో ప్లాన్ చేస్తున్నారట. ఎన్టీఆర్ ను చాలా పవర్ ఫుల్ గా కొరటాల చూపించబోతున్నారట. మరి అంత బడ్జెట్ తో ఎన్టీఆర్ ను ఏవిధంగా కొరటాల చూపిస్తాడో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement