Friday, April 26, 2024

నవరస వెబ్ సిరీస్…డ్యూరేషన్ ఎంతో తెలుసా ?

మణిరత్నం తెరకెక్కిస్తున్న నవరస వెబ్ సిరీస్ కోసం సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ కు సంబంధించి విడుదలైన థీమ్ సాంగ్, లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే తొమ్మిది రసాలను పూర్తిస్థాయిలో ఈ సినిమా ద్వారా చూపించేందుకు దర్శకనిర్మాతలు ప్లాన్ చేసుకున్నారు. దీని వెనుక ఎంతో మంది ప్రముఖులు కృషి కూడా ఉంది.

ఇక ఈ వెబ్ సిరీస్ డ్యూరేషన్ పై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సీజన్ నిడివి మొత్తం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు పైనే ఉన్నట్లు తెలుస్తోంది. అంటే ఒక్కో ఎపిసోడ్ కి 30 నిమిషాల పాటు ఉండే అవకాశం ఉందట. మరి దీనిపై క్లారిటీ రావాలంటే రిలీజ్ వరకు ఆగాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement