Tuesday, April 30, 2024

MS Dhoni Birthday : ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్ వద్ద ధోనీ భారీ కటౌట్.. ఒక రోజు ముందే మెద‌లైన‌ వేడుకలు

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రేపటితో(జూలై 7) 42వ ఏట అడుగెడుతున్న సందర్భంగా ఈ భారత డైనమైట్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ.. తెలుగు ఫ్యాన్స్ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ధోనీ పుట్టినరోజుకు ముందే వేడుకకు సన్నాహాలు మొదలుపెట్టారు. హైదరాబాద్‌లో అభిమానులు ఆయన కటౌట్‌ను చాలా ఎత్తుగా ఏర్పాటు చేశారు.

జూలై 7న ధోనీ తన 42వ పుట్టినరోజు జరుపుకోనున్నాడు. ఈ సంద‌ర్భంగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ న‌టించిన ధోని అన్ టోల్డ్ స్టోరీ సినిమాని రీరిలీజ్ చేయ‌నున్నారు. దీంతో.. అతని పుట్టినరోజుకు ఒక రోజు ముందు, మహేంద్ర సింగ్ ధోనీ ఫ్యాన్స్ అసోసియేషన్ హైదరాబాద్ ఆధ్వర్యంలో నగరంలోని ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్ వద్ద 52 అడుగుల భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ధోనీ బర్త్‌డే సందర్భంగా శుక్రవారం ఈ భారీ కటౌట్‌ను ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేయనున్నారు. ధోనీ గ్రౌండ్‌లోకి వస్తున్న ఫోజ్‌‌తో ఈ కటౌట్ ఏర్పాటు చేశారు. ధోనీ కటౌట్‌కు సంబంధించిన చిత్రాలు కూడా సోషల్ మీడియాలో షేర్ అయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement