Monday, April 29, 2024

Captain Miller | యాక్షన్ మోడ్‌లో ధనుష్.. ‘కెప్టెన్ మిల్లర్’ ట్రైలర్ రిలీజ్..

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ లేటెస్ట్ అప్‌కమింగ్ పాన్ ఇండియన్ మూవీ ‘‘కెప్టెన్ మిల్లర్’’. అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో 1930ల బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీని తెరకెక్కించారు. కాగా, ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది. తాజాగా కెప్టెన్ మిల్లర్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ కు సోషల్ మీడియాలో మంచి స్పందన వస్తుంది. బ్రిటీషర్లకు వ్యతిరేకంగా పోరాడే పాత్రలో హీరో ధనుష్ నటించాడు. ఈ సినిమాకి పార్ట్-2 కూడా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.

YouTube video

ఈ సినిమాలో ప్రియాంకామోహన్, శివ రాజ్కుమార్, సందీప్ కిషన్ తదితరులు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇక, ఇప్పటికే సెన్సార్ పనులు పూర్తిచేసుకున్న ఈ సినిమా కి యు/ఏ సర్టిఫికెట్ వచ్చింది. ఈ సినిమా రన్ టైం 2 గంటల 37 నిమిషాలు ఉంది. తమిళంలో కెప్టెన్ మిల్లర్ సినిమాకి శివ కార్తికేయన్ నటించిన అయలాన్ గట్టి పోటీ ఇవ్వనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement