Sunday, April 28, 2024

డీల్ ఇంకా కాలేదట ?

జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన మలయాళ చిత్రం దృశ్యం. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ సాధించడంతో ఈ సినిమాకు సీక్వెల్ గా ఇటీవల దృశ్యం2 చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే అనూహ్యంగా ఈ చిత్రం కూడా మంచి విజయం సాధించింది. కాగా తెలుగులో దృశ్యం సినిమాను వెంకటేష్ రీమేక్ చేశారు. అయితే తెలుగులో కూడా ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఇప్పుడు దృశ్యం 2 కూడా వెంకటేష్ రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ ను కూడా కంప్లీట్ చేసేసారు.

అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాను ఓటిటి లో రిలీజ్ చేసేందుకు అమెజాన్ ప్రైమ్ వారితో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంకా డీల్ మాత్రం కంప్లీట్ కాలేదట. మరి ఈ చిత్రం థియేటర్స్ లో రిలీజ్ అవుతుందో లేక ఓటీటీ లో రిలీజ్ అవుతుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement