Sunday, April 28, 2024

సూర్య42 పై క్రేజీ అప్డేట్.. టైటిల్ అనౌన్స్‌మెంట్ డేట్ ఫిక్స్ చేసిన మేకర్స్

కోలీవుడ్‌లో భారీ అంచనాలున్న ప్రాజెక్ట్‌లలో ‘‘సూర్య42’’ ఒకటి. సిరుత్తై శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ సూర్క కెరీర్‌లో ది బిగ్ ప్రాజెక్ట్. అయితే, ఈ సినిమా ఒక పీరియడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా, ఈ నెల (ఏప్రిల్) 16న ఉదయం 09:05 గంటలకు మూవీ టైటిల్ & రిలీజ్ డేట్ ని ప్రకటించనున్నట్టు ప్రకటించారు మేకర్స్. దానికి సంబంధించి తాజాగా ఒక పోస్టర్ ని కూడి రిలీజ్ చేశారు.

పోస్టర్‌లో, ఉరుములతో కూడిన తుఫానుల మధ్య సూర్య గుర్రంపై స్వారీ చేస్తున్నట్లు చూడవచ్చు. ఈ లేటెస్ట్ అప్డేట్ తో అభిమానులు, ప్రేక్షకల్లో సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి అనే చెప్పవచ్చు. ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాలో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ లీడింగ్ లేడీగా నటిస్తోంది. కె.ఇ. యూవీ క్రియేషన్స్‌పై వంశీ, ప్రమోద్‌తో కలిసి స్టూడియో గ్రీన్‌పై జ్ఞానవేల్ రాజా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ బిగ్ బడ్జెట్ మూవీ 10 భాషల్లో, 3D వెర్షన్‌లో కూడా విడుదల కానుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement