Monday, April 29, 2024

క‌రోనా భారిన ప‌డ్డ న్యూజిలాండ్ స్టార్ ప్లేయ‌ర్.. టెస్ట్‌ కెప్టెన్‌గా టామ్ లాథ‌మ్‌..

టెస్ట్ మ్యాచ్ ల కోసం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్నన్యూజిలాండ్ టీమ్ ఈ రోజు నుంచి ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా రెండో టెస్టు ఆడాల్సి ఉంది. అయితే.. ఆ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కు క‌రోనా పాజిటివ్ గా నిర్ధార‌ణ అయ్యింది. కాగా, ఈ టెస్టు నుంచి కేన్ త‌ప్పుకుంటున్న‌ట్టు తెలిపాడు.

మ్యాచ్ ఆరంభానికి కొన్ని గంటల ముందు స్వల్ప లక్షణాలు కనిపించడంతో అతడికి రాపిడ్ యాంటీజెన్ పరీక్ష నిర్వహించారు. ఈ ప‌రీక్ష‌ల్లో విలియమ్సన్‌కు పాజిటివ్‌గా తేలడంతో అతడు ఐదు రోజులు ఐసొలేషన్‌లోకి వెల్లాల‌ని వెల్ల‌డించారు మెడిక‌ల్ సిబ్బంది. దీంతో విలియమ్సన్ లేకపోవడంతో అత‌ని స్థానంలో ఓపెనర్ టామ్ లాథమ్ కివీస్ కెప్టెన్ గా వ్యవహరించనున్న‌ట్లు టీమ్ మేనేజ్‌మెంట్ తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement