Sunday, May 5, 2024

సునీల్ భువ‌న విజ‌యమ్ కి.. యూ/ఏ సర్టిఫికెట్‌

న‌టుడు సునీల్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం భువ‌న విజ‌యమ్. ఈ మూవీకి యూ/ఏ సర్టిఫికెట్ వ‌చ్చింది. యలమంద చరణ్‌ డైరెక్ట్‌ చేస్తున్నారు. శ్రీమతి లక్ష్మి సమర్పణలో హిమాలయ స్టూడియో మ్యాన్షన్స్‌ బ్యానర్‌పై కిరణ్‌, వీఎస్‌కే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి సెన్సార్‌ అప్‌డేట్ వచ్చేసింది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి క్లీన్ యూ/ఏ సర్టిఫికెట్‌ జారీ చేసింది. అంతేకాదు విడుదల తేదీపై కూడా క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్‌. వంద శాతం పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌.. మే 12న థియేటర్లలో విడుదల కానుందని తెలియజేస్తూ.. కొత్త లుక్ ఒకటి విడుదల చేశారు. స్టోరీ ఆఫ్ స్టోరీ టెల్లర్స్ థీమ్‌తో వస్తున్న ఈ మూవీ గ్లింప్స్ వీడియోలు సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. భువన విజయమ్‌ నుంచి లాంఛ్ చేసిన Birth Of Bhuvana Vijayam, సోల్‌ ఆఫ్ భువన విజయమ్‌, వెన్నెల కిశోర్ ..రామస్వామి క్యారెక్టర్ గ్లింప్స్ వీడియోలు ఫన్‌గా సాగుతూ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.. కామెడీ థ్రిల్లర్‌ జోనర్‌లో వస్తోన్న ఈ చిత్రంలో థర్టీ ఇయర్స్ పృథ్విరాజ్‌, జబర్ధస్త్‌ రాఘవ, షేకింగ్ శేషు, గోపరాజు రమణ, ధన్‌ రాజ్‌, వెన్నెల కిశోర్, శ్రీనివాస్‌ రెడ్డి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement