Wednesday, May 15, 2024

ప్రభాస్ హాలీవుడ్ ఎంట్రీ పై క్లారిటీ ?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇటలీ లో జరిగింది. కాగా ఇదే సమయంలో హాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం మిషన్ ఇంపాజిబుల్ 7 షూట్ కూడా అక్కడే జరిగిందట. కాగా ఆ చిత్రం దర్శకుడు క్రిస్టోఫర్ ప్రభాస్ తో కలిసి మాట్లాడారట.

అంతేకాకుండా ఒక స్టోరీ కూడా ప్రభాస్ కు అప్పుడు చెప్పాడని కొన్ని కథనాలు బయటకు వచ్చాయి. ఇక అక్కడి నుంచి కూడా ప్రభాస్ హాలీవుడ్ ఎంట్రీపై చర్చ నడుస్తోంది. కాగా దానిపై రకరకాల వార్తలు తెరపైకి వచ్చాయి. అయితే దీనిపై ఎవరికి కూడా అసలు విషయం మాత్రం తెలియరాలేదు. కాగా ఆ వార్తలపై దర్శకుడు ఎట్టకేలకు ఫుల్ స్టాప్ పెట్టాడు. ప్రభాస్ చాలా టాలెంటెడ్. కానీ తాను ఎప్పుడూ కలవలేదు అంటూ ఈ రూమర్ కి సింపుల్ గా చెక్ పెట్టేసారు. ఇక దీనితో హాలీవుడ్ లో ప్రభాస్ ఎంట్రీ అనేది అవాస్తవం అని తేలిపోయింది.

https://twitter.com/chrismcquarrie/status/1397456441708003333?s=19
Advertisement

తాజా వార్తలు

Advertisement