Friday, April 26, 2024

‘ఆచార్య’కి రికార్డ్ వ్యూస్.. మెగాస్టార్ స్టామినా ఇది

మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ఈ మూవీ నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. అయితే, ఈ మూవీలోని పాట రికార్డు సృష్టిస్తోంది. మణిశర్మ సంగీతాన్ని అందించిన ఈ మూవీలని ‘లాహే లాహే .. ‘ పాటను కొన్ని రోజుల క్రితం విడుదల చేశారు. చిరంజీవి పుట్టినరోజైన ఈ నెల 22న ఈ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ పాట యూ ట్యూబ్ లో దూసుకుపోయింది. ఇంతవరకు ఈ సాంగ్ 80 మిలియన్ల వ్యూస్ ను రాబట్టింది. ఈ మధ్యకాలంలో అలరించిన పాటల్లో ఇంత తక్కువ టైమ్ లో 80 మిలియన్ల వ్యూస్ సొంత చేసుకున్న పాట ఏదీ లేదని. ‘ఆచార్య’ మూవీలోని ‘లాహే లాహే .. ‘  పాట ఇలా తొలి రికార్డును నమోదు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement