Tuesday, May 21, 2024

శంకర్ సినిమా కోసం చరణ్ మేకోవర్!!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ ను ప్రారంభించి చాలా ఏళ్ళు అవుతుంది. అయితే అందులో కొన్ని సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆ సినిమాలలో చరణ్ నటన అద్బుతమని చెప్పాలి. ఉదాహరణకు మగధీర, రంగస్థలం చిత్రాలు. ఈ చిత్రాలలో చరణ్ జీవించే చేశారు. అలాగే ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ కనిపించబోతున్నాడు. ఇప్పటికే అందుకు సంబంధించిన లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

అయితే ఈ సినిమా తర్వాత సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో కూడా చరణ్ రోల్ అద్భుతంగా ఉంటుందట. అంతే కాదు ఈ సినిమా కోసం చరణ్ ఒక స్పెషల్ మేకోవర్ లోకి మారబోతున్నాడట. మరో రెండు నెలల్లో రామ్ చరణ్ పూర్తిగా కొత్త లుక్ తో సిద్ధం అవుతాడని తెలుస్తోంది. కాగా ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి సినిమాపై అంచనాలు అంతకంతకు ఎక్కువవుతున్నాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement