Friday, May 17, 2024

ఇప్పుడు కాక ఇంకెప్పుడు…కేసు నమోదు

ఇప్పుడు కాక ఇంకెప్పుడు సినిమాపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల సుమోటో కేసు నమోదు అయింది. సినిమా ట్రైలర్ లోని ఓ సన్నివేశంలో హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా ఉందని ఆన్లైన్ లో వచ్చిన ఫిర్యాదు మేరకు 67 IT యాక్ట్, 295 IPC సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పాటలు, డైలాగ్స్, సీన్లు హిందు మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని సోషల్ మీడియాలోనూ అభ్యంతకర పోస్టులు వెలువడ్డాయి.

ఆ సన్నివేశాలను తొలగించకపోతే సినిమా విడుదలను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈమేరకు సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు చిత్ర యూనిట్‌పై సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. త్వరలో చిత్ర యూనిట్‌కు నోటీసులు జారీ చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement